Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Rajasingh Controversy: టీ.బీజేపీలో రాజాసింగ్ కల్లోలం

Rajasingh
Spread the love

Rajasingh Controversy: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తెలంగాణ బీజేపీ సీరియస్‌గా ఉంది. స్టేట్ బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఎపిసోడ్ కల్లోలం రేపుతోంది. తరుచుగా టీ.బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హిజ్రాలు అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకత్వం సీరియస్‌గా ఉంది. ఎమ్మెల్యే వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో టీ.బీజేపీ నాయకత్వం చర్చించనుంది. రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైకామండ్‌తో చర్చించి ఎమ్మెల్యేపై చర్యలకు స్టేట్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

రోజు రోజుకు రాజాసింగ్(Rajasingh) ఎపిసోడ్ చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ఈరోజు సాయంత్రం జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడి ఆయనను సస్పెండ్ చేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాళ్లతో పనిచేయడానికి బదులు తనను సస్పెండ్ చేయాలంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను అటు హైకమాండ్.. ఇటు స్టేట్ బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి కూడా బీజేపీలో రెబల్ క్యాండిడేట్‌గా రాజాసింగ్ ఉన్నారు. గత కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో రాజాసింగ్‌కు పొసగని పరిస్థితి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మధ్యవర్తిత్వం వహించి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, రాజాసింగ్‌కు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు ముగిసే వరకు బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ కొద్దిరోజులుగా రాజాసింగ్ స్వరం పెంచారు.

ముఖ్యంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్‌గా మారే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడినా, పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్, స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్ చేయాల్సిందిగా సవాల్ విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హైకమాండ్.. ఏ క్షణమైనా రాజాసింగ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top