బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ కొత్త బట్టలను పంపిణీ చేశారు.
కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ స్వయంగా తన వ్యక్తిగత ఖర్చుతో కొత్త బట్టలను పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, జెడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యులు ఎండి. షాబీర్ పాషా, మాజీ ఎంపీటీసీ సభ్యులు దావ కమలమనోహర్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పెరుక లక్ష్మణరావు, దూలం మధు, సోమినేని కనకయ్య, పెరుక జనార్ధన్, దుర్గం శ్రీహరి, భూస పరశురాములు, గాలి పెళ్లి రవీందర్, బొచ్చు కరుణాకర్, కటకం నర్సింగరావు, పెద్ది వెంకన్న తదితరులు, గ్రామ యువకులు హాజరయ్యారు.
పండుగ సందర్భంగా కొత్త బట్టలు అందుకున్న పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ, తమ పట్ల చూపిన గౌరవానికి మాజీ ఎంపీపీ శ్రీలత మహేష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.