బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్ ను అబాస్ పాలు చేస్తుంది. వేసవిలో చేయాల్సిన పనులు వానకాలంలో చేస్తూ ఉండడంతో జనానికి తిప్పలు తప్పట్లేదు.
బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్ ను అబాస్ పాలు చేస్తుంది. వేసవిలో చేయాల్సిన పనులు వానకాలంలో చేస్తూ ఉండడంతో జనానికి తిప్పలు తప్పట్లేదు. శాఖల మధ్య సమన్వయం ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తోంది. వర్షాకాలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని జిహెచ్ఎంసి పైకి చెబుతున్న హైదరాబాద్ లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
గుత్తేదారులు ఇష్ట రాజ్యంగా తవ్వకాలు చేసి వదిలేయడంతో ఎప్పుడు పూర్తి చేస్తారోనని జనం ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో రహదారులు వీధులు నగరపౌరులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రోడ్ల పరిస్థితి. ఊపర్ షేర్వాని అందర్ పరేషాని అన్న సామెతకు నిదర్శనంగా గ్రేటర్ హైదరాబాద్ నిలుస్తుంది.

జిహెచ్ఎంసి ఇంజనీర్ల నిర్లక్ష్యం నిధుల సమస్య గుత్తేదారుల అలసత్వంతో రహదారులు వీధుల్లో పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరదనీరు, డ్రైనేజీ, తాగునీరు విద్యుత్ కేబుల్ లైన్ల పేరిట తవ్వకాలు జరుపుతున్నారు. పలు చోట్ల కొత్తగా వేసిన రోడ్లను ఇష్టారీతిన తవ్వి పడేస్తున్నారు. కొన్ని చోట్ల నాలాల నిర్మాణాలు ఏళ్లుగా నిలిచిపోగా మరికొన్ని పాడైన మ్యాన్ హోల్స్ ను తవ్వి వదిలేయడంతో రోడ్లపై మురుగు పారుతోంది. ప్రణాళిక లేకుండా చేపడుతున్న పనులతో నగరవాసులు చుక్కలు చూస్తున్నారు.
జిహెచ్ఎంసి,హెచ్ఎండిఏ జలమండలి మధ్య సమన్వయ లోపం ఇంజనీర్ల పర్యవేక్షణ కొరవడంతో కొత్తగా వేసిన రోడ్లను తవ్వేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జిహెచ్ఎంసి విజిలెన్స్ విభాగం చోద్యం చూస్తుండడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ముషీరాబాద్ అంబర్పేట్ నియోజక వర్గాల్లోని ప్రధాన రహదారులు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు నివాసం ఉండే ప్రాంతాలు కొన్ని అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్న అధికారులు బస్తీలు కాలనీల్లో ఏళ్లుగా గుంతలమయమైనా పట్టించుకోవట్లేదు.

సికింద్రాబాద్ నుంచి ముషీరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు ఏళ్లుగా గుంతలతో నిండి ఉండగా వరదతో ప్రమాదకరంగా మారుతోంది. ముషీరాబాద్ నుంచి రామనగర్ వైపు వెళ్ళే దారిలో గతంలో 36 లక్షలతో కొత్తగా డ్రైనేజీ పైపులైన్ కోసం రోడ్డు మధ్యలో తవ్వి డ్రైనేజీ పైపులు వేసి వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కవాడిగూడ, బోలక్పూర్, విద్యానగర్, గాంధీనగర్, బాగలింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం తైతర ప్రాంతాల రోడ్లు గొంతలమయంగా మారాయి.
హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రధాన రహదారికి ఇరువైపుల వరదనీరు వెళ్ళేందుకు చేపట్టిన వరదనేటి డ్రైన్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఖైరతాబాద్ పెద్ద గణేష్ చౌరస్థా నుంచి మింట్ కాంపౌండ్ ను కలిపే రహదారిని సిసిీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని జిహెచ్ఎంసి చేపట్టిన పనులు గందరగోళంగా మారాయి. ఇటీవలే మింట్ కాంపౌండ్ నుంచి సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు నాలా పనులు జరిగాయి.

ఇప్పుడు మళ్ళీ పెద్ద గణేష్ రోడ్డును తవ్వడంతో స్థానికులతో పాటు వాహనదారులు సతమతం అవుతున్నారు. ఫార్ములా రేస్ కోసం నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్ లోని కొంత భాగం కలిపి ఐమాక్స్ ఎదురుగా బీటీ రోడ్డు నిర్మించారు. ఇక్కడ వారాల కొద్ది వర్షపు నీరు నిలుస్తోంది. సమస్యను వేసవిలోనే పరిష్కరించాల్సిన యంత్రాంగం ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు తవ్వకాలు చేపట్టి పైపులైన్లు వేస్తుండడం గమనార్హం.
హైదరాబాద్ లోని ప్రజాభవన్ సమీపంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద డ్రైనేజీ పనులు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామనగర్లో ఏళ్లుగా రోడ్డుపై మురుగు పారుతోంది. ఇక మోరి నాలుగు నాలుగు రోజులు నిండుతా ఉంటది ఎవరు కేర్ చేస్తలేరు వాంతలు వస్తున్నాయి పిల్లలు షాప్ దగ్గరే ఉంది ఇక షాప్ లో కూసోవాలంటే వాంతలు వస్తుంది వాసన వస్తుంది ఇక ఎవరు కేర్ చేస్తలేరు ఎవరు చూస్తలేరు చేస్తలేరు నెలలో రెండు మూడు సార్లు నిండుతది. ఇక అది అట్లానే పోతాయి నల్ల వచ్చినక నల్ల నీళ్లు కూడా అట్లానే పోతాయి. దాంట్లోనే ఆ బూడద నీళ్లు కూడా అట్లానే డైనిజ్ నీళ్లు అంతా పోతాది దాంట్లో ఇక దానికి ఎవరు చేస్తారు ఎవరికి చేస్తారు అట్లానే మహినేమ దినమా ఇతల హోతి గా వానమాత ఇతనే నిండుత ఉంటది ప్లస్ అదొకటి జహెచ్ఎంసి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి.

హైదరాబాద్ రోడ్స్ గురించి ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఇట్లా మనం మొత్తం పార్కింగ్ సరిగా లేక మొత్తం బైక్స్ మొత్తం బయట ఉంటాయి. ఒక వెహికల్ రానియకుండా ఒక ఎమర్జెన్సీ ఒక యంబులెన్స్ రావాలంటే కూడా రాదు మనకి. యంబులెన్స్ మెయిన్ మీ కోసం మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తది అన్నమాట. ప్రతి రెండు రోజుకి నేను ఫోన్ చేస్తా ఉంటా జహెచ్ఎంసి వాళ్ళకి. ఆయనకు రెగ్యులర్ ఫోన్ చేస్తే తర్వాత ఆయన నాకు కాల్ చేసి మీరు ఎవరని నాకే క్వశ్చన్ చేస్తుండు. పర్సనల్ గా వచ్చి విజిట్ చేసిండు నా స్టోర్ కి పైప్ లైన్ చేంజ్ చేయాలి.
మనం ఏ గవర్నమెంట్ కి ఏం తిడతలేము ఇది ఒక టైం లో వేసింది పైప్ లైన్ ఇది దీనికి చేంజ్ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు దీనిలో భూమిలో ఎంత సేమ్ సైజ్ ఉంది అది నార్మల్ గా మనం మన ఇంట్లో పెడుతున్నాం ఆ సైజ్ ఇది ఫస్ట్ మేము చిన్నప్పటి నుంచి ఇడే పుట్టి పెరిగినం ఫస్ట్ ఏ టైంలో వేసిరు 8 టైంలో అప్పటినుంచి ఇప్పటి దాకా అద చేంజెస్ అవ్వలేదు. మంజీరా పైప్లైన్ మరమ్మత్తుల కోసం హఫీస్పేట్ నుంచి లింగంపల్లి వరకు రోడ్డు తవ్వి కొత్త పైప్లైన్ వేశారు. ఏడాదైనా మళ్ళీ వేయకపోవడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చందానగర్ నుంచి అమీన్పూర్ రోడ్డు వర్షాలకు గుంతలమయంగా మారింది.

దుండిగల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ పనులు ముందుకు సాగట్లేదు. గండిమైసమ్మ చౌరస్థ నుంచి బహదూర్పల్లి సందయ్య కుంట వరకు 50 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు నత్తనాడకన సాగుతున్నాయి. మెదక్ ప్రధాన రహదారి కావడంతో వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బహదూర్పల్లి టెక్ మహింద్ర నుంచి జ్యోతిబా పూలే స్టేడియం వరకు దాదాపు 25 లక్షలతో నిర్మిస్తున్న పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ బోయిన్ చెరువు సమీపంలోని రహదారిపై రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్న తరుణంలో దారి మూసేయడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కానాజీగూడ ప్రధాన రహదారిపై నాలా విస్తరణ కల్వట్టు నిర్మాణం నేపథ్యంలో ఆరు నెలలుగా రహదారిని ఇరువైపులా మూసివేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో కల్వర్టు వద్ద నాలాలో వర్షపు నీరు నిలిచిపోయి కారని బస్తీలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెంటనే కల్వట్టు పనులు పూర్తి చేసి వర్షపు నీరు వెనక్కి వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చంపపే డివిజన్ పరిధిలోని యాదగిరి నగర్ రాజరెడ్డి నగర్ ఈస్ట్ మారుతి నగర్ కారణీలో మురుగు ముంపు సమస్య పరిష్కారం కోసం రెండు కోట్లతో బాక్స్ డ్రైన్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సాగర్ రోడ్డు సమీపం నుంచి రాజరెడ్డి నగర్ మూలమలుపు వరకు ట్రంక్ లైన్ పనులు చేశారు. సిసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రాజరెడ్డి నగర్ పైభాగం యాదగిరి నగర్ ఈస్ట్ మారుతి నగర్ వరకు పనులు చేపట్టాల్సి ఉన్న మూడు నెలలుగా గుత్తేదారు చేతులఎత్తేశరు. ఇటీవల కురిసిన వర్షాలకు కారణంలోకి వరద వచ్చి రాజరెడ్డి నగర్లోని ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు తిప్పలు పడుతున్నారు. మూసాపేట్ సర్కిల్ మైసమ్మ చెరువు వద్ద చేపట్టిన మురుగునీటి దారి మళ్ళంపు పనులు రెండేళ్ళ అవుతున్నా పూర్తి కావట్లేదు.
హైదరాబాద్ లోని ఐడియల్ చెరువు వరద నాలా విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పాత బస్తిలోని మౌలాకా జిల్లా గంగానగర్ కాలనీలో చేపట్టిన నాలా పనులు 2023 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. అర కిలోమీటర్ పొడవున నెలకొన్న సమస్యను జిహెచ్ఎంసి పరిష్కరించలేకపోతుంది. ఇళ్ల మధ్య నుంచి నాలా కోసం రోడ్డును తవ్వడంతో రెండేళ్లుుగా స్థానికులు నరకం చూస్తున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఏ వీధిలో చూసినా ఏ దారిలో వెళ్ళినా రోడ్డు తవ్వుతూనో లేక తవ్వి వదిలేసిన దృశ్యాలు మురుగు పారుతున్న దారిలో కనిపించవంటే అతిశయోక్తి కాదు నాలాల నిర్మాణం అయితే పూర్తిగా ఆటకెక్కింది.

ఓవైపు వర్షాలు దంచి కొడుతున్న దాదాపు నాలుగేళ్ల కింద మొదలైన పనులు సైతం ముందుకు సాగట్లేదు. జిహెచ్ఎంసి ఇప్పటికే 500 కోట్లను నాలాలపై ఖర్చు చేసింది. మిగిలిన పనులకు రెండో దశ నాలా పనులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని అభ్యర్థించిన ఇప్పటివరకు సర్కార్ నుంచి హామీ లభించలేదు. పైగా కేంద్ర సర్కార్ నాలాల కోసం విడుదల చేసిన 250 కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు అందించట్లేదు. నాలుగేళ్లుుగా జిహెచ్ఎంసి వద్ద వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పనుల బిల్లులు పేరుకుపోయాయి. దాదాపు 500 కోట్ల బకాయలు ఉన్నట్లు గుత్తేదారులు చెప్తున్నారు. బిల్లులు రాలేదని గుత్తేదారులు పనులు ఆపేయడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ నగర రహదారులు వీధుల్లో జరిగే అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్షించి కాలంతో సంబంధం లేకుండా కష్టాలు తీర్చాలని ప్రజలు వేడుకొంటున్నారు.