తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాటగీత నర్సింహ్మ , తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి నియోజకవర్గం న్యూ జెరుసలేం గాస్పల్ చర్చ్ పాస్టర్స్ ఆహ్వానమేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చర్చిలో కేక్ కట్ చేసి, సమాధాన ఆత్మీయ సహవాస పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సత్యరాజ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. చిన్నపిల్లలతో కలిసి “మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్” అంటూ చప్పట్లతో, మ్యూజిక్ డ్రమ్ సౌండ్స్ తో పాటలు పాడుతూ ప్రార్థనలు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పరలోకంలో ఉన్న ప్రభువును ప్రార్థిస్తున్న యేసు బిడ్డలందరికి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సమాజంలో అందరికీ మతస్వేచ్ఛ ఉంటుంది,” అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి అంజయ్య, సురేష్ పాల్గొన్నారు.