Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు.

కాకతీయ
Spread the love

ఏసీబీ వలలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్,రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కిష్టయ్య.

యూనివర్సిటీలో ఆయనవి కీలక బాధ్యతలు

ఏ.ఆర్. కిష్టయ్య వెనుక వున్న తిమింగలం ఏవరు..?

కాకతీయ యూనివర్సిటీ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అయితే విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య పై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్ కిష్టయ్య ను క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతి వాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ బదిలీ చేయించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

యూనివర్సిటీ లో కీలకైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ తో పాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఒక్క హాస్టల్ లోనే పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. యితే ఇంకా దీని వెనుక పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే అనుమానంతో ఏసీబీ విచారణ జరుపుతోంది. బిల్లులు తయారు చేసేదీ తానే… ఆ బిల్లులు పాస్ చేసేది తానే కావడంతో ఏ.ఆర్ కిష్టయ్య చేతి వాటానికి అంతు లేకుండా పోయిందనే అరోపణలు ఉన్నాయి.

Back To Top