దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుల నర్సింహా డిమాండ్ చేశారు.
దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుల నర్సింహా డిమాండ్ చేశారు.
ఆమనగల్లు మండలం విట్టాయిపల్లి అరుంధతి కాలనీలో ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాల్యంలో కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. నెహ్రూ, ఇందిరా ప్రభుత్వాల్లో రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా అవినీతి మరకలేకుండా సేవలందించారు.
భారత్–పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా దేశానికి విజయాన్ని అందించిన ఘనత ఆయనకే దక్కింది. వ్యవసాయ మంత్రిగా ‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.సీ.ఐ)ని స్థాపించి దేశానికి ఆహార భద్రత కల్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం ఆయన జీవిత ధ్యేయమని, అంబేద్కర్ గారి సమకాలికుడిగా సమాజ ఉన్నతికి కోసం నిరంతరం కృషి చేశారని ఉప్పుల నర్సింహా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె. సాలయ్య, జిల్లా ప్రతినిధి వద్ది నిరంజన్, కె. దశరథం, వై. రామచంద్రయ్య, జి. రామస్వామి, కె. వీరయ్య, రాములు, వై. జంగయ్య, కె. నరేష్, ఎస్. మల్లయ్య, వై. మహేష్, డి. జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

