పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నాం:పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..

పెద్దపల్లి
Spread the love

పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

అనంతరం తుర్కమద్దికుంట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దుస్తువులు అందజేసి పిల్లలకు అక్షరాభ్యాసం ఎమ్మెల్యే విజయరమణ రావు చేపించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..

పార్టీలు మరియు రాజకీయాలకతీతంగా పేదల  సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు.  కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ 6 కోట్లకు పైగా ఖర్చు పెట్టి వసతులు కల్పించి అందించామని అన్నారు.
రైతన్నలకు 21 వేలకోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్లకు ప్రభుత్వం రూ. 500 బోనస్ అందిస్తుందని, గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా క్రింద రూ. 12000 ఎకరానికి అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.


గతంలో ఎన్నికల ముందు హడావుడిగా పూర్తికాని ఇండ్లకు, కరెంట్ స్ట్రీట్ లైట్ రోడ్లు, త్రాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌళిక సదుపాయాలు లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత  అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు కల్పించి 466 ఇండ్లు పంపిణీ చేశామని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకు రూ. 38 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇస్తే, కేవలం పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు రూ. 31 కోట్లు బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని అన్నారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా గ్రామస్థులు మరియు పాఠశాల యాజమాన్యం తదితరులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల నరేష్ మరియు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు మాజీ జడ్పీటీసీ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top