Headline
గ్యాస్
గ్యాస్ లేక ఇండక్షన్? యుద్ధం, ధరల ఎఫెక్ట్ మధ్య సామాన్యుడి వంటగదికి ఏది సేఫ్ ?
చిరంజీవి
Gaddar Film Awards 2026: చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
లలితా దేవి
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దాం – రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి
రష్యా
సంక్షోభంలో భారత్‌కు అండగా నిలిచిన రష్యా…
మావోయిస్టులు
మావోయిస్టులు గన్ దించి రాజ్యాంగ బాటలోకి రావాలి
ధర్మ
Bandi Sanjay – ధర్మ స్వేచ్ఛకు ప్రతీకమైన త్యాగమూర్తి గురు తెగ్ బహదూర్ జీ
వాసవి
Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
ఆల్ఫోర్స్
Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ
Telangana High Court
Telangana High Court – ప్రతిసారి టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు సరికొత్త రికార్డు

నెల్లూరు జాతి ఆవు
Spread the love

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు. దీంతో ఈ జాతి ఆవుకు సరికొత్త రికార్డు సృష్టించింది.

బ్రసీలియా :  బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లోని సావో పాలో అరండోలో ( Arandú, São Paulo Brazil) జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర పలికింది. దీంతో ఈ జాతి ఆవు సరికొత్త రికార్డు సృష్టించినట్టయ్యింది. భారతీయ కరెన్సీలో ఈ ఆవు ధర రూ.40 కోట్లు ధర పలికింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలు జాతి ఆవులను వయాటినా 19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ (Viatina-19 FIV Mara Imóveis) అని పిలుస్తారు. ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.

1868లోనే ఒంగోలు మేలు జాతి ఆవుల జంటను బ్రెజిల్‌కు తరలించారు. నాటి నుంచి ఈ జాతి ఆవుల వృద్ధికి ఆ దేశం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఈ జాతి ఆవులు నేటికి 16 మిలియన్ల వరకు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ దేశంలో 80 శాతం ఆవులు ఈ జాతివే కావడం గమనార్హం. అత్యధిక ఉష్ణోగ్రతలకు సైతం తట్టుకొని పెరగడం.. జీవక్రియ సమర్థవంతంగా జరుగుతుండడం.. అంటువ్యాధులకు తట్టుకొని ఉండడం.. అంటే వ్యాధి నిరోధకతను బాగా కలిగి ఉండడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా ఉన్నాయి.

దీంతో ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఆ క్రమంలోనే బ్రెజిల్‌లోని పశువుల పెంపకందారులు సైతం ఈ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జాతి ఆవు శాస్త్రీయనామం ‘బాస్ ఇండికస్’. తెలుపు రంగులో ఉండి.. చూడడానికి చాలా బలిష్టంగా కనిపించడం ఈ జాతి ఆవుల ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో మేలు జాతి ఆవులకు ప్రసిద్ధి.

Back To Top