యూసుఫ్ మహమ్మద్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ :
యూసుఫ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆయనకు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందించారు.
అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది.
వాతావరణం ఆనందభరితంగా, ఉత్సాహభరితంగా కొనసాగింది.
మంత్రి శ్రీధర్ బాబుకి
తనపై చూపిన ఆదరణకు, ఆశీర్వాదానికి యూసుఫ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.