రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది-జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి
Spread the love

బీఆర్‌ఎస్‌లో చేరికపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నదని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ప్రజలు ఆశించిన పాలన రాలేదని,రేవంత్ పాలన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని.. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఏప్రిల్ 13న జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్ ఈరోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి పార్టీలోకి అధికారికంగా వెళ్లి ఆహ్వానించారు. జీవన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పని చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top