ఘనంగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

మైత్రి
Spread the love

మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

కరీంనగర్: మైత్రి గ్రూప్స్ చైర్మన్ శ్రీ కొత్త జయపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, మిత్రమండలి సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కేక్ కట్, పండ్ల పంపిణీ, అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.

మైత్రి టవర్స్, జ్యోతినగర్

మైత్రి చానల్ ఎండీ శ్రీ బొల్లినేని సుజన్‌రావు, మిత్రమండలి సభ్యులు శ్రీ దువ్వంతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మైత్రి టవర్‌లో కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి వేడుకలు నిర్వహించారు. “సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జయపాల్ రెడ్డి గారు మరిన్ని పదవులు అధిరోహించాలని” ఆకాంక్షించారు.

మంగపేట, గంగాధర మండలం

శ్రీ బైరి గంగారెడ్డి ఆధ్వర్యంలో మిత్రమండలి సభ్యులు కేక్ కట్ చేసి, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. వికలాంగులైన శ్రీమతి లింగాల లచ్చవ్వకు ₹5,000, అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ ఆడెపు మల్లేశంలకు ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీ తోట నరేష్, మాజీ ఉప సర్పంచ్ శ్రీ కార్తీక్ రెడ్డి, శ్రీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అగ్రహారం, రాజన్న సిరిసిల్ల జిల్లా

హనుమాన్ దేవాలయంలో శ్రీ నాగారపు సత్యనారాయణ, శ్రీ గోపాల్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. “ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని” ఆంజనేయ స్వామిని ప్రార్థించారు.

మధురానగర్, గంగాధర మండలం

మధురానగర్ చౌరస్తాలో మిత్రమండలి సభ్యులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ మండ్లపల్లి రమేష్, శ్రీ నాగారపు సత్యనారాయణ, శ్రీ రాసూరి సంజీవ్, శ్రీ పెంచాల మల్లేషం, శ్రీ మోతే శ్రీహరిరెడ్డి, శ్రీ సంకటి శ్రీనివాస్, శ్రీ గుంట ప్రసాద్, శ్రీ తడకమడ్ల దామోదర్ రెడ్డి, శ్రీ తిరుపతి, శ్రీ మేడి సుబ్బు, శ్రీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

బతికెపల్లి, పెగడపల్లి మండలం

మాజీ ఎంపీటీసీ శ్రీ క్యాస జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. “నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని” ఆకాంక్షించారు.

లక్ష్మీదేవిపల్లి

శ్రీ గుర్రం లావణ్య–రాజిరెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. “భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని” ఆకాంక్షించారు.

గోపాల్ రావుపేట, రామడుగు మండలం

గోపాల్ రావుపేట కూఢలి వద్ద మిత్రమండలి సభ్యులు కేక్ కట్ చేసి, జయపాల్ రెడ్డి పేరిట అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, శ్రీ ముదిగంటి సంతోష్ రెడ్డి, శ్రీ నేరెళ్ల వెంకట్, శ్రీ నేరెళ్ల అంజయ్య, శ్రీ కంకణాల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పిండి రాజిరెడ్డి, శ్రీ ముదిగంటి మధు, శ్రీ కర్ర కమలాకర్ రెడ్డి, శ్రీ ఎడవెల్లి సాత్విక్ రెడ్డి, శ్రీ పొన్నం శ్రీను, శ్రీ పొన్నం కర్ణాకర్, శ్రీ జాలి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గట్టుబుత్కూర్, గంగాధర మండలం

చౌరస్తాలో మిత్రమండలి సభ్యులు కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ కాంపల్లి రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. “జయపాల్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ… ఉన్నతంగా ఎదగాలని” ఆకాంక్షించారు.


కరీంనగర్లో బర్గర్ కింగ్ బేకరీ ప్రారంభం

కరీంనగర్, అక్టోబర్ 1: కిసాన్ నగర్‌లో బర్గర్ కింగ్ అనే బేకరీను ప్రారంభించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో సేవలు అందించనున్నట్లు బేకరీ మేనేజర్ శ్రీ నాగేందర్ తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీ జిల్లా వేణు, షాపింగ్ కాంప్లెక్స్ యజమాని శ్రీ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరై బర్గర్ కింగ్‌ను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top