అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై హత్యాయత్నం

ట్రంప్‌
Spread the love

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. దుండగుడి జరిపిన కాల్పుల్లో ట్రంప్‌కు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. దుండగుడి జరిపిన కాల్పుల్లో ట్రంప్‌కు గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు దుండగుడిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు. గాయపడిన ట్రంప్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అమెరికాలోని పెన్సినియాలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

భద్రతా సిబ్బంది దుండగుడిని కాల్చి చంపారు. అయితే ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తుండగా, దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల తర్వాత లేచి ‘ఫైట్‌’ అంటూ ట్రంప్‌ నినాదాలు చేశారు. ఈ ఘటనలో ట్రంప్‌ చెవికి బుల్లెట్‌ గాయమైంది. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్‌ క్షేమంగానే ఉన్నారని సీక్రెట్‌ సర్వీస్‌ చెబుతోంది. బట్లర్ కౌంటీ జిల్లా న్యాయవాది సీబీఎస్‌ పిట్స్‌బర్గ్ ఇద్దరు వ్యక్తులు చనిపోయారని నిర్ధారించారు. కాల్పులు జరగగానే ట్రంప్‌ తప్పించుకునేందుకు కిందికి వంగిపోయారు.

డోనాల్డ్ ట్రంప్
డోనాల్డ్ ట్రంప్

చెవికి బుల్లెట్‌ గాయం కావడంతో ముఖంపై నుంచి రక్తం కారిపోయింది. సంఘటన తర్వాత ట్రంప్ ఒక ప్రకటనలో, అతను క్షేమంగా ఉన్నానని, స్థానిక వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతుందని ట్రంప్ ప్రతినిధి తెలిపారు. కాల్పుల సమయంలో త్వరితగతిన చర్య తీసుకున్నందుకు ట్రంప్ ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు అధికార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. సీఎన్‌ఎన్‌ నివేదిక ప్రకారం, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై కాల్పులు జరగగానే భద్రతా సిబ్బంది ఆ దుండగుడిని కాల్చి చంపారు.

సంఘటన వీడియోలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, అతని పరిపాలన గురించి ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కాల్పుల శబ్ధం వినిపించిందని, దీని తర్వాత, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అతన్ని రక్షించి వాహనంలో వేదికపై నుండి ఆస్పత్రికి తరలించారని సీక్రెట్‌ సిబ్బంది వెల్లడించింది. ట్రంప్‌ను వేదికపై నుంచి దించగానే పిడికిలి పైకెత్తి నినాదాలు చేశారు. ఆయన భద్రత కోసం చర్యలు చేపట్టామని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ వేదికపై నుంచి వెళ్లిన వెంటనే పోలీసులు మైదానాన్ని క్లియర్ చేశారు.

అమెరికాలో హింసకు చోటు లేదు: జో బైడెన్

కాగా, పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిగినట్లు నాకు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. ట్రంప్‌ ఆరోగ్యం మెరుగు పడాలని కోరారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దీనిని ఖండించడానికి మనం ఒక జాతిగా ఏకం కావాలి.. అని బైడెన్‌ అన్నారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ట్రంప్ కోసం ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కోసం ప్రార్థిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

ఆందోళన వ్యక్తం చేసిన బరాక్ ఒబామా:

మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ఏమి జరిగిందో మాకు ఇంకా ఖచ్చితంగా తెలియనప్పటికీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్దగా గాయపడలేదని, ఆయన ప్రాణానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు.

అమెరికా కోసం పోరాటం ఆగదు

ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అమెరికా జెండా ముందు పిడికిలి పైకెత్తి రక్తంతో ముఖంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అమెరికాను కాపాడే పోరాటాన్ని ఎప్పటికీ ఆపబోనని పోస్ట్‌లో అన్నారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో మాట్లాడుతూ, ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడిని లక్ష్యంగా చేసుకుని హింస చేయడం సరైంది కాదన్నారు.

రాజకీయాల్లో హింసకు తావు లేదు: నరేంద్ర మోదీ

నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మా ఆలోచనలు మరియు ప్రార్థనలు మరణించిన వారి కుటుంబానికి, గాయపడిన వారికి మరియు అమెరికన్ ప్రజలకు ఉన్నాయి.

ట్రంప్ పై దాడి హేయమైన చర్య : రాహుల్ గాంధీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం పట్ల నేను తీవ్ర ఆందోళన చెందుతున్నాను.

ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండించాలి.

అతను త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

Back To Top