రోజూ అరటి పండును తింటున్నారా? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదకరం!!

అరటి పండు
Spread the love

రోజూ అరటి పండును తింటున్నారా? ఇలా తింటే మాత్రం వెరీ డేంజర్..!అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. దీని వల్ల ఆమ్లతత్త్వం తయారు అవుతుంది. అలాగే పరగడుపున అరటి తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కాబట్టి, అనారోగ్య సమ్యలు ఉన్నవారు తప్పనిసరి వైద్యుల సలహా మేరకు తినటం మంచిది.

అరటి పండును పేదల యాపిల్‌గా పిలుస్తారు. ఎందుకంటే అరటి పండులో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నాయి. ఈ పండు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు ఒక అరటి పండును తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అరటిపండులో విటమిన్ సి,B6, ఫైబర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండుతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కానీ, అన్ని వేళల అరటిపండు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అందరికీ అందుబాబులో ఉండే అరటి పండును తినడం చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అరటిపండుతో తక్షణ శక్తి లభిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండును తినడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో అరటి పండును కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటి పండు
అరటి పండు

మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను పాలలో కలిపి తింటాము. కానీ అరటి పండును పాలలో కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉదయం, సాయంత్రం అరటి పండు తినడం చాలా మంచిది. కానీ, రాత్రి పూట అరటి పండును తినకపోవడమే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల జలుబు, మ్యూకస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మంది పండ్లను తింటారు. అయితే అరటి పండును మాత్రం తినకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, చాలామంది పాలు తాగాక అరటి పండును తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. దీని వల్ల ఆమ్లతత్త్వం తయారు అవుతుంది. అలాగే పరగడుపున అరటి పండు తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కాబట్టి, అనారోగ్య సమ్యలు ఉన్నవారు తప్పనిసరి వైద్యుల సలహా మేరకు తినటం మంచిది.

Back To Top