Ambedkar:అసమానతల లేని సమాజమే అంబేద్కర్‌ కు నిజమైన నివాళి – యాదిలాల్

Ambedkar
Spread the love

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌(Ambedkar) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌(Ambedkar) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన టిడిపి రాష్ట్ర నాయకుడు, ఆమనగల్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అండేకర్‌ యాదిలాల్ నాయకులతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—సమాజంలో అసమానతలు, అన్యాయాలు పూర్తిగా తుదముట్టే రోజే డాక్టర్‌ అంబేద్కర్‌(Ambedkar) కల సాకారం అవుతుందని చెప్పారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ, ఆ హక్కులు పేదల గడప దాటేలా చేయడం ప్రభుత్వాల బాధ్యతన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా ప్రతి పౌరుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.“అంబేద్కర్‌ చూపిన మార్గం సమానత్వం… ఆ మార్గంలో నడవడం మన అందరి ధర్మం” అని యాదిలాల్ స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో పేదలు, వెనుకబడిన వర్గాలకు అవకాశం లభించడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. సమాజంలో చివరి వాడి జీవితంలో వెలుగు నిండే వరకూ అంబేద్కర్‌ సందేశం పోరాటానికి దిక్సూచిగా ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కండె సత్యనారాయణ, అర్థం నరసింహ, రామ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top