సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
సిరిసిల్ల జిల్లాలోని గుడిపేట గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఘనమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కోరికలు నెరవేరే దేవాలయంగా ఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రధాన అర్చకులు శ్రీకిర్ని కుమారస్వామి ఆధ్వర్యంలో మూడు లక్షల బిల్వపత్రాలతో పాటు 550 కమలాలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి.
ఈ మహోత్సవంలో పెద్ది శ్రీనివాస్, చంద్రకళ, తొడుపునూరి శ్రీనివాస్, ఉమ, తోడుమూరు చంద్రం, కవిత, ఎర్రగంటి ప్రకాష్, సరస్వతి, దెబ్బేటి దేవదాస్, రమాదేవి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయబడింది.
కార్తీక మాసంలో స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిరసానుభూతిని ఆస్వాదించారు.

