మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ (Maa TAMBA) ఆధ్వర్యంలో మహా నంది అవార్డుల వేడుక గురువారం నగరంలో ఘనంగా జరిగింది.
మా తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ (Maa TAMBA) ఆధ్వర్యంలో మహా నంది అవార్డుల వేడుక గురువారం నగరంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివాహ సేవా రంగంలో విశేష సేవలందించిన సభ్యులను గుర్తించి, వారిని గౌరవించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవార్డు ఉత్సవానికి రాష్ట్ర సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, TPT ACP బీ. గంగాధర్, BJP అసెంబ్లీ కన్వీనర్ దూబల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, అవార్డు గ్రహీతలకు సత్కారం నిర్వహించారు.
అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రాదండి వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల Maa TAMBA నాయకత్వ సభ్యులు, మహిళా విభాగ ప్రతినిధులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కొండమీది తిరుపతి స్వామికి మహా నంది అవార్డు మరియు సర్టిఫికెట్‌ను అందజేశారు.
అవార్డు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కనపర్తి మురళి, ప్రధాన కార్యదర్శి సిద్ధి మహేష్ కుమార్, గౌరవ సలహాదారు కారంగుల చంద్రశేఖర్ రెడ్డి, కార్యనిర్వాహక అధికారి కంకణాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి జక్కని మచ్చయ్య, గౌరవ అధ్యక్షులు గండ్ర నర్సింగ రావు, ప్రచార కార్యదర్శి గూడ సుధీర్, జిల్లావారి నుండి బొడ్ల మారుతి, మాడిశెట్టి శ్రీనివాస్, దేశాన్ని వీరేశం, మెరుగు రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అంజనేయ సేవా సమితి భజనమండలి సభ్యులు జాడి రాజు, పిట్ల స్వామి, జగపతి వర్మ, బత్తిని తిరుపతి గౌడ్, దాసరి బూమ్ రావు, గోకుల్ శ్రీనివాస్, బండారి కొమురయ్య లు తమ భక్తి సంగీతంతో అందరిని అలరించారు.
“వివాహ సేవల రంగాన్ని సుస్థిరంగా నిలబెట్టడమే లక్ష్యం. భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపడతాం” అని రాదండి వెంకటేష్ తెలిపారు.