తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

తెలుగుదేశం
Spread the love

శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది.

హైదరాబాద్, అక్టోబర్ 26 (చైతన్య గళం): శనివారం హైదరాబాద్లోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టిఆర్ భవన్లో ‘‘తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26’’ మంగళవాయిద్యాలతో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11 గంటల 59 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో, అండమాన్ నికోబార్ దీవులలో వర్చువల్గా ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సభ్యత్వాన్ని చంద్రబాబు గారు స్వీకరించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాలను అర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలోనే సభ్యత్వ నమోదు కరపత్రాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న ఈ రోజు పవిత్రమైన రోజు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వల్ల సమాజంలో కార్యకర్తలకు, నాయకులకు గౌరవం, గుర్తింపు ఉంటుందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ రాకముందు తెలుగు జాతిని వర్ణించుకునే పరిస్థితి ఏమిటో గుర్తుచేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించాక తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.


కార్యకర్తలు పెద్ద పీట వేసిన పార్టీగా, కార్యకర్తల మనోభావాలను గుర్తించిన పార్టీగా, కార్యకర్తల భాగస్వామ్యంతో కమిటీలను ఎంపిక చేసుకుని యువతను ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని అన్నారు.


సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన పార్టీగా, బడుగు, బలహీనవర్గాల నుంచి చదువుకున్న వారిని పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలను కల్పించిన పార్టీగా తెలుగుదేశం పార్టీని పేర్కొన్నారు.


రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న ఎవరిని చూసినా వారి మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభమైన పరిస్థితి ఉందని అన్నారు.


కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించిన పార్టీగా, నారా లోకేష్ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని ప్రారంభించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని అన్నారు.
ఈ బీమాను ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. దేశ రాజకీయాలలోనూ చరిత్ర సృష్టించిన పార్టీగా, 35 మంది ఎంపీలతో లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా పని చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని అన్నారు.
జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను పునరేకీకరణ చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ సమన్వయకర్త కంభంపాటి రామమోహన్రావు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top