Site icon Chaithanya Galam News

దేశ ఆర్థిక బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం – రాంచందర్ రావు

దేశ

దేశ

Spread the love

భారత ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సప్త సూత్రాలు” అంశంపై గురువారం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రధాని సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన పాంప్లెట్‌ను విడుదల చేశారు.

భారత ఆర్థిక స్వావలంబన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సప్త సూత్రాలు” అంశంపై గురువారం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రధాని సూచించిన 10 ప్రధాన సూచనలతో కూడిన పాంప్లెట్‌ను విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ, “ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. స్వదేశీ వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు భారత ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేస్తాయి” అని అన్నారు. దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాకుండా, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప భక్తి అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ డా. కృష్ణారెడ్డి “సప్త సూత్రాలు”పై సమగ్ర విశ్లేషణ చేశారు. అంతర్జాతీయ సవాళ్లు, విదేశీ మారక ద్రవ్య వినియోగం, సహజ వ్యవసాయం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు ఆర్థిక స్థిరత్వానికి ఎలా దోహదపడతాయో వివరించారు. ఆయన అభిప్రాయపడ్డారు, “ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు తీసుకొస్తే భారత ఆర్థిక శక్తి గణనీయంగా పెరుగుతుంది”.

రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని సూచనలు రాజకీయ అంశాలు కావని, అవి ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించినవని స్పష్టం చేశారు. “లోకల్ ఫర్ వోకల్” భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఖర్చుల్లో మితవ్యయం పాటించాలని, ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు.

ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత వాహనాలను వాడాలని, హైదరాబాద్‌లో మెట్రో, ప్రజా రవాణా వినియోగించాలని సూచించారు. ఐటీ రంగంలో కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా కఠినమైన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తు చేస్తూ, ప్రధాని సూచనలను విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.

దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తెలంగాణ ప్రజలు ప్రధాని పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భారతసేవలో భాగస్వాములు కావాలని రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్, రాష్ట్ర పదాధికారులు, మీడియా ప్యానలిస్టులు పాల్గొన్నారు.

Exit mobile version