Site icon Chaithanya Galam News

మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

మహిళా

మహిళా

Spread the love

ఆర్బిఐ నిబంధనల ప్రకారం అందించే రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని, సమయానికి తిరిగి చెల్లించాలి. రుణాలతో పాటు మహిళలకు చైతన్యం కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా గ్రామీణ కూట బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేస్తున్నామని డివిజన్ మేనేజర్ వారణాసి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో బ్యాంకు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేనేజర్ బ్యాంకు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆర్బిఐ నిబంధనల ప్రకారం అందించే రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకొని, సమయానికి తిరిగి చెల్లించాలి. రుణాలతో పాటు మహిళలకు చైతన్యం కల్పిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి” అని సూచించారు.తరువాత ఆరుగురు మహిళలకు రుణాల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఏరియా మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ నరేష్, సపోర్టింగ్ మేనేజర్ మాణిక్యం, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర కుమార్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, శంకర్, సింధు, చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో పాటు పలువురు నాయకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version