Site icon Chaithanya Galam News

భూ కబ్జాదారుల గుట్టురట్టు చేసిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు

పోలీసులు

పోలీసులు

Spread the love

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా భూ కబ్జాదారుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ వారు చాకచక్యంగా భూ కబ్జాదారుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితులు ఒక ముఠాగా ఏర్పడి, ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి యజమానుల వివరాలు సేకరించి నకిలీ పత్రాలు సృష్టించేవారు. మొదట తమ ముఠాలో ఒకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ తరువాత మరొకరి పేరుతో మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ లింక్ డాక్యుమెంట్లు తయారు చేసేవారు. ఈ నకిలీ పత్రాలతో అమాయకులకు భూములు విక్రయించి వచ్చిన డబ్బులను పంచుకునేవారు.

ఇదే విధంగా పద్మనగర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 212లో గల 242 చదరపు గజాల స్థలాన్ని నకిలీ లింక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసి వేరే వ్యక్తులకు విక్రయించారు.

అరెస్టైన నిందితులు కిన్నెర మల్లవ్వ, భామండ్ల రవీందర్, లోకిని పోచయ్య, అనుముల బాలయ్య, లోకిని ఆదిత్య, లోకిని రాజవ్వ @ రాజమ్మగా పోలీసులు గుర్తించారు.

ఈ ఆపరేషన్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి పర్యవేక్షించారు.

Exit mobile version