Site icon Chaithanya Galam News

కరీంనగర్‌లో సామాన్యుల రాజ్యం – బండి సంజయ్

కరీంనగర్‌

కరీంనగర్‌

Spread the love

కరీంనగర్‌లో సామాన్యుల రాజ్యం వచ్చింది.ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరు, బ్లాక్ మెయిల్ చేయరు.కార్పొరేషన్‌లో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తాం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఎంత ఎదిగినా ఒదిగే ఉంటా. నా దగ్గరకు పనుల కోసం వచ్చే వారితో పైసలు ఆశించను. ప్రజలకు సేవ చేయడమే నా తృప్తి’’ అని అన్నారు.

కరీంనగర్ గాంధీ రోడ్‌లోని వైశ్య భవన్‌లో శనివారం జరిగిన ఆర్యవైశ్య కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కార్పొరేషన్‌ లో సామాన్యుల రాజ్యం వచ్చింది. ఇకపై వ్యాపారులను ఎవరూ బెదిరించరు, బ్లాక్ మెయిల్ చేయరు. కార్పొరేషన్‌లో అవినీతి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తాం’’ అని స్పష్టం చేశారు.

‘‘కష్టపడి పైకొచ్చాం. మీ ఆశీర్వాదంతోనే మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్నాం. అందమైన, ఆదర్శవంతమైన కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని తెలిపారు.

కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version