Site icon Chaithanya Galam News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన బండి సంజయ్ కుమార్

మోదీ

మోదీ

Spread the love

కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని అభిప్రాయపడినట్లు సమాచారం.

కరీంనగర్‌లో బీజేపీ విజయానికి బండి సంజయ్ అహర్నిశల కృషి, పట్టుదల, ప్రజలతో ఉన్న అనుబంధమే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి సారి ప్రధాని మోదీని కలిసిన తర్వాత బండి సంజయ్ మరింత ఉత్సాహంతో, దేశ సేవ పట్ల మరింత నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని నాయకులు చెబుతున్నారు.

తెలంగాణలో బీజేపీని గ్రామ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన నిరంతరం కృషి చేస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శనం బండి సంజయ్‌కు మరింత శక్తినిస్తూ భవిష్యత్ విజయాలకు పునాది వేస్తున్నాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

“దేశం ముందుంటేనే పార్టీ ముందుంటుంది” అనే భావనతో పనిచేస్తున్న బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుకు ఆశాకిరణంగా నిలుస్తున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు.

Exit mobile version