Site icon Chaithanya Galam News

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు – ఎమ్మెల్యే చింతకుంట

ఇందిరమ్మ

ఇందిరమ్మ

Spread the love

ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ గ్రామాల్లో సోమవారం రోజున పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోసిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు .

ముందుగా ఐతరాజ్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణ రావు …

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…

ఆరు గ్యారెంటీ ల అమలుతోపాటు రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, సన్నవడ్లకు బోనస్, ఇసుక ఫ్రీ, కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన పనితీరును, ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు దామోదర్ రావు, చిలుక సతీష్, పన్నాల రాములు,జానీ,వెంకటరమణ రావు, వెంకన్న, రాజి రెడ్డి,బక్కయ్య,రాజు, చిన్నయ్య మరియు ఎంపీడీవో, పలువురు అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version