తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ప్రముఖ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తిరస్కరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం తమిళనాడు బీజేపీలో చర్చనీయాంశంగా మారగా, ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

