కరీంనగర్ వైశ్యభవన్‌లో వైశాఖ పౌర్ణమి స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం 1100 మంది మాతలతో కలిసి శ్రీ లలితాదేవి సహస్రనామార్చన పారాయణం అత్యంత వైభవంగా జరిగింది.
కరీంనగర్ వైశ్యభవన్‌లో వైశాఖ పౌర్ణమి స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం 1100 మంది మాతలతో కలిసి శ్రీ లలితాదేవి సహస్రనామార్చన పారాయణం అత్యంత వైభవంగా జరిగింది.
ప్రముఖ జ్యోతిష్య–వాస్తు–ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.
నిర్వాహకులు మాట్లాడుతూ—
- లోకకల్యాణార్థం, సకల సౌభాగ్య సిద్ధికై ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
- ప్రజలలో ఈర్ష్య, ద్వేషాలు తొలగి అన్యోన్యత, అనురాగాలు పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం కే ఆర్ హాస్పిటల్ మరియు ఈషా ఈవెంట్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది.
ప్రముఖ ఆధ్యాత్మిక–సామాజికవేత్త గుండా రాధా కిషన్, ఆర్కే హాస్పిటల్ నిర్వాహకుడు బండారి రాజ్ కుమార్, ఈసా ఈవెంట్స్ నిర్వాహకురాలు కృష్ణప్రియతో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
భక్తులు తీర్థప్రసాదం స్వీకరించి, అమ్మవారి ప్రసాద తాంబూలాన్ని అందుకున్నారు.