Site icon Chaithanya Galam News

రేపే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా ప్రమాణ స్వీకారం

మహాసభ

మహాసభ

Spread the love

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా మీడియా కమిటీ కన్వీనర్ ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా మీడియా కమిటీ కన్వీనర్ ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

సామాజిక సేవా స్పూర్తితో, సంఘ ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మే 2వ తేదీ శనివారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ నగరంలోని హస్తినాపురం, సాగర్ రోడ్‌లో గల జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరగనుందని పేర్కొన్నారు.

సంఘ అభ్యున్నతి, సభ్యుల సంక్షేమం, యువతకు మార్గదర్శనం, సమాజ ప్రగతికి నూతన దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య బంధువులు, ప్రముఖులు, మిత్రులు, అభిమానులు కుటుంబ సభ్యులతో సహా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఆర్యవైశ్య సమాజ ఐక్యతకు నాంది పలికే ఈ మహాసభ ప్రమాణ స్వీకార వేడుకకు తరలివచ్చి ఆశీర్వదించాలని ప్రొద్దుటూరి రవీందర్ గుప్తా విజ్ఞప్తి చేశారు.

Exit mobile version