Site icon Chaithanya Galam News

ఢిల్లీలో ఘజియాబాద్ ఎంపీతో మిర్యాలగూడ నేతల భేటీ

ఘజియాబాద్

ఘజియాబాద్

Spread the love

ఘజియాబాద్ ఎంపీ అతుల్ గార్గ్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మిర్యాలగూడ ఇంచార్జ్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి, జాతీయ నాయకుడు మర్పల్లి అంజయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గానికి ప్రవాసిగా విచ్చేసిన ఎంపీ అతుల్ గార్గ్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మిర్యాలగూడ ఇంచార్జ్ గోగిరెడ్డి లచ్చిరెడ్డి, జాతీయ నాయకుడు మర్పల్లి అంజయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడలో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఎంపీ అతుల్ గార్గ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ తరఫున సేవలందిస్తున్నారు.

Exit mobile version