Site icon Chaithanya Galam News

Alforce – ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు ప్రమాదం డ్రైవర్ పరారీ

ఆల్ఫోర్స్

ఆల్ఫోర్స్

Spread the love

కరీంనగర్ రూరల్ పరిధిలోని దుర్షేడ్ బస్టాప్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ (Alforce) పాఠశాల బస్సు డ్రైవర్ పరారీలో ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్ రూరల్ పరిధిలోని దుర్షేడ్ బస్టాప్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ (Alforce) పాఠశాల బస్సు డ్రైవర్ పరారీలో ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దుర్షేడ్ గ్రామం నుంచి కరీంనగర్ వైపు తన షైన్ మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న కిసాన్‌నగర్‌కు చెందిన బొడ్డు శశికుమార్‌ (28)ను వెనుక నుంచి ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. స్కూలు టీచర్లను ఎక్కించుకుని వస్తున్న ఆ బస్సును డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

బస్టాప్ సమీపంలో బస్సు ఢీకొనడంతో శశికుమార్ రోడ్డుపై పడిపోగా, బస్సు అతని తలపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాల కారణంగా శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆల్ఫోర్స్ స్కూల్ బస్సు డ్రైవర్ బస్సును పక్కకు వదిలి పారిపోవడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సముదాయించిన రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి, పరారీలో ఉన్న ఆల్ఫోర్స్ పాఠశాల బస్సు డ్రైవర్ పంతంగి అనిల్‌ను త్వరలోనే పట్టుకుంటామని, అతనిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన ఆల్ఫోర్స్ బస్సు (నంబర్: TS 22 TA 0953)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు శశికుమార్ కరీంనగర్ నగర పాలక సంస్థలో అవుట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తుండగా, అతడికి భార్య, చిన్న పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరారీ కావడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version