Site icon Chaithanya Galam News

Vasavi : ఘనంగా వాసవి వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

వాసవి

వాసవి

Spread the love

వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి(Vasavi) వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది.

కరీంనగర్: వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి(Vasavi) వనిత ఏంజిల్స్ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రావికంటి భాగ్యలక్ష్మి అధ్యక్షురాలిగా, పల్లెర్ల విద్య కార్యదర్శిగా, గుండ శ్రీదేవి కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ వేడుకలో అకిరాల శ్రీనివాస్, రాచమల్ల గాయత్రి, జైన అర్చన, సూర గీత, పబ్బా అరుణ, జందే మాధవి, బండ సంధ్యారాణి, తుడుపునూరి స్వర్ణలత తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 200 మందికి పైగా సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అదే వేదికపై వాసవి వనిత ఏంజిల్స్ ఆధ్వర్యంలో మహిళల కోసం ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. అశోకనగర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చుక్కల ముగ్గులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. పోటీదారులు స్వయంగా ముగ్గుపిండి, రంగులు తెచ్చుకుని తమ ప్రతిభను ప్రదర్శించారు.

విజేతలకు వెండి ఫ్రేమ్ బహుమతులు అందజేయబడ్డాయి. మొదటి బహుమతి 8000 విలువైన వెండి ఫ్రేమ్, రెండవ బహుమతి 6000, మూడవ బహుమతి 4000గా నిర్ణయించారు. అదనంగా 10 కన్సోలేషన్ బహుమతులు, ప్రతి పాల్గొన్న వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హరిహర జ్యువెలరీ స్పాన్సర్‌గా నిలిచింది. భోజనాన్ని సితార డ్రాప్ డ్రీమ్, అంబేద్కర్ రోడ్, రిలయన్స్ స్మార్ట్, క్రిస్టియన్స్ కాలనీ వారు స్పాన్సర్ చేశారు.ఈ వేడుకలో వాసవి వనిత ఏంజిల్స్ పాలకవర్గం సభ్యులు రావికంటి భాగ్యలక్ష్మి, పల్లెర్ల విద్య, గుండ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version