ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ గా ఎస్. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ గా ఎస్. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ శంకర్ నాయక్ గురువారం అడ్మినిస్ట్రేషన్ శాఖ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ పత్యనాయక్, కౌన్సిలర్లు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు కూడా కొత్త కమిషనర్ కు అభినందిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమీషనర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిషనర్
ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎస్. రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా అమనగల్లు పట్టణ అభివృద్ధిపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని ఎమ్మెల్యే కమిషనర్ కు సూచించారు. పట్టణ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

