కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గురువారం గాంధీనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ మిశ్రా గురువారం గాంధీనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకుని, బ్యాలెన్స్ వర్క్స్‌ను సత్వరమే పూర్తి చేసి ఇండ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బి అధికారులు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బ్లాక్‌ల వారీగా ఇండ్లను అన్ని రకాలుగా సంసిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహ చారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
