Site icon Chaithanya Galam News

జనగణన నమోదు చాలా సులువు – మంత్రి బండి సంజయ్

బండి

బండి

Spread the love

జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా ప్రతి ఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

నగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా ప్రతి ఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

ఈ నెలలో ప్రారంభమైన జనగణనలో తొలిదశలో హౌజ్ లిస్టింగ్, హౌజింగ్ సెన్సెస్ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం https://se.census.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు.

జాతీయ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ దీరజ్ జైన్తోపాటు పలువురు ఉన్నతాధికారులు న్యూఢిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లి జనగణనలో చేపడుతున్న తొలి దశ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్వయంగా తన ఇల్లు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించడం శుభపరిణామమని, వికసిత భారత్ లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ మహత్తర జాతీయ కార్యక్రమాన్ని కాగితాలతో పనిలేకుండా డిజిటల్ సాధనాలతో నిర్వహించడం, పౌరులకు స్వీయ ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించడం ద్వారా జనగణన విజయవంతం అవుతుందని అన్నారు.

ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను సమర్పించడం ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ అధికారిక పోర్టల్ https://se.census.gov.in ను సందర్శించి నమోదు పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Exit mobile version