Site icon Chaithanya Galam News

చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

చేనేత

చేనేత

Spread the love

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఆమనగల్లు : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎంగళి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆమనగల్లు పట్టణంలోని కార్మికులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న జాతీయ చేనేత ఎగ్జిబిషన్‌కు తరలివెళ్లారు. ఈ ఎగ్జిబిషన్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన కార్మికులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు ఎంగళి ప్రసాద్ తెలిపారు.

కార్యక్రమంలో పాలది పురుషోత్తం, సత్యనారాయణ, ఆనందు, బుచ్చయ్య, వెంకటేష్, యాదయ్య, తిరుపతయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version