Site icon Chaithanya Galam News

వైభవంగా గీతా–లలిత సహస్ర గళ పారాయణ శోభాయాత్ర

సహస్ర

సహస్ర

Spread the love

శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది.

ఆదివారం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. శ్రీ గీత భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత మరియు లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణ శోభాయాత్ర నగర వీధులన్నింటినీ భక్తి–భావనలతో అలరించింది.

అంగడి బజారు మలయాళ సద్గురు మఠంలోని శ్రీ గీత మందిరం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బజారు శివాలయం, ప్రకాశం గంజ్, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్ గుండా గాంధీ రోడ్ వైశ్య భవన్ వరకు అద్భుతంగా సాగింది. వందలాది మంది భక్తులు భజనలు, నామజపం, కోలాటలతో యాత్రను మరింత వైభవవంతం చేశారు. శ్రీకృష్ణ భగవంతుడు, లలిత మాతతో పాటు ఇతర ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించబడి భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి.

ఈ పవిత్ర యాత్రలో శ్రీ విష్ణు సేవానంద గిరి స్వామి, శ్రీ సంపూర్ణ నంద గిరి స్వామి (హైదరాబాద్), జ్యోతిష్య–వాస్తు–ఆగమ శాస్త్ర పండితుడు శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారు.

శోభాయాత్రకు గీత భక్త సమాజం అధ్యక్షులు బండ సత్తయ్య నేతృత్వం వహించగా, కమిటీ సభ్యులు వెంకటేశం, ఆంజనేయులు, రాధకిషన్, దామోదర్, సుదర్శనం, దశరథం, అల్లే చిన్న వెంకటయ్య, సత్యనారాయణ తదితరులు సమగ్రంగా నిర్వహించారు.

Exit mobile version