Site icon Chaithanya Galam News

విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం: మంత్రి టి.జి భరత్

మంత్రి

మంత్రి

Spread the love

కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.

కర్నూలు, అక్టోబర్ 2 : కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రారంభించారు.


అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ, సమాజంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్న తీరు అభినందనీయమని వివరించారు.


ముఖ్యంగా వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో మొట్టమొదటగా సేవలందించేది విద్యుత్ ఉద్యోగులని, అందుకే వారికి అపారమైన గౌరవం ఉందని తెలిపారు.


విద్యుత్ శాఖ ఇంజనీర్లు తమ ఉద్యోగుల కోసం ఏపీ ఎస్ ఈ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ టిజివి భవన్ నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కర్నూలు నగరంలో ఇలాంటి కార్యక్రమాలకు టీజీవి గ్రూపు సంస్థల తరఫున నిరంతరం సహకారం ఉంటుందని, విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో తీగలు సమస్యలను పరిష్కరిస్తే తనకు సంతోషం ఉంటుందని తెలిపారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు రాష్ట్ర ముఖచిత్రానికి ప్రతిబింభమని చెప్పారు.


విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, గతంలో ఉద్యోగులకు జీతాలు ఏ తేదీన వచ్చేది అర్థం కాని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మొదటి తారీకు జీతాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.


కర్నూలు నగరంలో తన తండ్రి టి.జి వెంకటేశ్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, వాటిని తిరిగి కమ్యూనిటీ హాల్స్ గా మార్చి మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం అందజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్.ఈ ఉమాపతి, ఏపీ ట్రాన్స్కో ప్రాజెక్ట్స్ ఎస్.ఈ బాబు రాజేంద్ర, ఏపీ ట్రాన్స్కో ఓ అండ్ ఎం ఎస్.ఈ మధుసూదన్ రావు, జిల్లా సెక్రెటరీ జగదీశ్వర్ రెడ్డి, బ్రాంచ్ సెక్రటరీ గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version