Site icon Chaithanya Galam News

Padma Awards 2024: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.

Spread the love

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను(Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది (Draupadi Murmu) ముర్ము ప్రదానం చేయగా.. మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.

Padma Awards

ఈ అవార్డ్‌ను అందుకోవడం కోసం చిరంజీవి బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం ఇదివరకే వైరల్ అయ్యాయి. ఇక గురువారం ఢిల్లీకి చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ వేడుకను వీక్షించేందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకునే సమయంలో.. ఆయన సతీమణి సురేఖతో పాటు కుటుంబ సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు. కళా రంగంలో చిరంజీవి అందించిన విశేష సేవలకు గాను.. చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాగా.. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించిన విషయం విదితమే!

ఇదిలావుండగా.. ఈ ఏడాదిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి సేవలందించిన వారిని పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందించారు. అసాధారణమైన విశిష్ట సేవకు పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, విశిష్ట సేవలకు పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు గ్రహీతల్లో 30 మంది మహిళలు ఉండటం విశేషం. ఈ జాబితాలో NRI/ PIO/OCI వర్గం నుంచి 8 మంది ఉండగా.. 9 మందికి మరణానంతరం అవార్డులను ప్రదానం చేయడం జరిగింది.

Exit mobile version