Site icon Chaithanya Galam News

TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి

TVK

TVK

Spread the love

హమ్మయ్య ఓపనైపోయింది. సీఎంగా ప్రమాణస్వీకారానికి TVK అధినేత విజయ్‌కు లైన్ క్లియర్‌ అయింది. చర్చోపచర్చల తర్వాత మేజిక్‌ ఫిగర్ ఫికర్ తగ్గింది. TVK పార్టీకి120 మంది ఎమ్మెల్యేల బలం ఉందని గవర్నర్‌కు విజయ్ తెలపడంతో శనివారం టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు నూతన సీఎంగా జోసెప్ విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

హమ్మయ్య ఓపనైపోయింది. సీఎంగా ప్రమాణస్వీకారానికి TVK అధినేత విజయ్‌కు లైన్ క్లియర్‌ అయింది. చర్చోపచర్చల తర్వాత మేజిక్‌ ఫిగర్ ఫికర్ తగ్గింది. టీవీకే పార్టీకి120 మంది ఎమ్మెల్యేల బలం ఉందని గవర్నర్‌కు విజయ్ తెలపడంతో శనివారం టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు నూతన సీఎంగా జోసెప్ విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.


గత మూడు రోజులుగా టెన్షన్‌గా కొనసాగుతున్న తమిళనాడు రాజకీయాలు కొలిక్క వచ్చాయి. ఓదశలో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయోమో అన్నట్టుగా సీన్‌ మారడంతో అందిరి చూపు తమిళనాడుపైనే పడింది. కానీ కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడం, లెఫ్ట్‌ పార్టీలు కూడా టీవీకే పార్టీకి మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో శుక్రవారం టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది.

ఇదే విషయాన్ని లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్ చర్చించారు. ఈ క్రమంలో తమకు 120 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని విజయ్ గవర్నర్‌కు లేఖలు అందజేశారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, VCK, IUMLల మద్దతుతో 120కి పెరిగినట్టు వివరించారు. దీంతో రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇక గవర్నర్ అనుమతితో లైన్‌ క్లియర్ కావడంతో సీఎంగా శనివారం ఉదయం 11కి నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌ ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.


Exit mobile version