ఎ.ఎస్. రావు నగర్ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశ్రీ, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గోవిందుడు–గోసంరక్షణ అంశంపై ప్రవచనం చేశారు.
వినోబా నగర్:శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మశ్రీ, ప్రవచన చక్రవర్తి గరికపాటి నరసింహారావు గారు గోవిందుడు–గోసంరక్షణ అంశంపై ప్రవచనం చేశారు.
భారతీయ సంస్కృతిలో గోసేవ మించినది లేదని, గోవులను రక్షించడం భూ సేవతో సమానమని ఆయన పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం అమలులో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని జరిపిటి అంజలీదేవి–ఆంజనేయులు దంపతులు ఏర్పాటు చేశారు. ప్రవచనానికి ముందు గురు ఆశా శిష్య బృందం కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు.
పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, జీవితకాల సభ్యులు, 1000 మందికి పైగా భక్తులు పాల్గొని ప్రవచనాన్ని విన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
నరసింహారావు గురు ఆశా శిష్య బృందాన్ని దేవస్థాన కమిటీ సత్కరించింది. ఈ ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం 9 గంటలకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగనుందని ఆలయ కమిటీ ప్రకటించింది.

