నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.
నందికొట్కూరు, మే 11 (చైతన్య గళం): నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం మాసుపేట గ్రామంలోని ఐటీసీ కంపెనీ గోడౌన్ ముందు సోమవారం పొగాకు రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు.
రైతులు మాట్లాడుతూ, “ క్వింటాల్‌కు 16 వేల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ, ఇప్పుడు తీరా 9 వేలకే కొనుగోలు చేస్తామని చెబుతోంది. ఇది రైతులపై తీవ్ర అన్యాయం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కష్టార్జిత పంటకు సరైన ధర ఇవ్వాలని, 16 వేల రూపాయలకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “రైతుల పట్ల ఈ నిర్లక్ష్యం కొనసాగితే మరింత ఉద్ధృతమైన ఆందోళనలు చేస్తాం” అని హెచ్చరించారు.
ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను బహిరంగంగా వ్యక్తం చేశారు.

