Site icon Chaithanya Galam News

నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలరించిన అవధానం

నా ఫౌండేషన్

నా ఫౌండేషన్

Spread the love

భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించే ఉద్దేశంతో పాటు రేపటి భావిభారత పౌరులైన విద్యార్ధిని విద్యార్థులకు భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేయడం కోసం భగవద్గీత అవధానం ఏర్పాటు చేశామని కార్యక్రమ నిర్వాహకులు నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు.


భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించే ఉద్దేశంతో పాటు రేపటి భావిభారత పౌరులైన విద్యార్ధిని విద్యార్థులకు భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేయడం కోసం భగవద్గీత అవధానం ఏర్పాటు చేశామని కార్యక్రమ నిర్వాహకులు నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్ పేర్కొన్నారు. నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో, సత్ జ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ చింతల మల్లేశం సహకారంతో సోమవారం కుత్బుల్లాపూర్ లోని సత్ జ్ఞాన్ హై స్కూల్ లో యువావధాని, ప్రవచన కర్త యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు చే భగవద్గీత అవధానం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా బాధ్యతలు నిర్వహించిన నిర్వాహకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ భావి తరాలకు సాహిత్యంలోని మాధుర్యం, భగవద్గీత ప్రాముఖ్యత తెలియజేసేందుకు తమ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఇందులో భాగంగానే భగవద్గీత అవధానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం ఇరువై రెండు సంవత్సరాల ప్రాయంలోనే యువ అవధానిగా, ప్రవచనకర్తగా రాణిస్తున్న ఉమామహేశ్వరరావు భవిష్యత్తులో శతావధాని గా ఎదగాలని ఆకాంక్షించారు. సత్ జ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ చింతల మల్లేశం కార్యక్రమానికి అధ్యక్షత వహించి అవధానిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఎంత చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను కనబరిచిన అవగానే భవిష్యత్తులో అత్యంత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు, విద్యార్థులు అందరూ అవధారణ మార్గదర్శకంగా తీసుకొని ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలి అని కోరారు. పాఠశాల పిల్లలనే పృచ్ఛకులుగా (ప్రశ్నలు అడిగే వారిగా) పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల విద్యార్థులలో భగవద్గీత పట్ల ఎంతగానో ఆసక్తి ఏర్పడిందని స్కూల్ కరస్పాండెంట్ చింతల మల్లేశం అన్నారు.

ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటుకు తమ పాఠశాలను ఎంపిక చేయడం ఆనందకరమైన అంశమని ఆయన అన్నారు. అవధానం లో పాలు పంచుకున్న అవధానికి, విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ అవధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతను ప్రతినిత్యం పఠించినట్లైతే తాము చదువుకుంటున్న విద్యలో కూడా మరింత రాణించగలుగుతారని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థి ఆగండి ఏకాగ్రతతో అత్యంత అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ అవధానం లో సత్ జ్ఞాన్ హై స్కూల్ విద్యార్దిని విద్యార్థులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. శ్లోక దర్శనం – నికిత, భవ్య శ్రీ, సంఖ్యా దర్శనం – లావణ్య, నవచైతన్య, అంత్యాక్షరి – ప్రభాస్, సాయి గీత, అధ్యాయ వివరణ – యశస్విని, జలహాసిని, అఖండ పఠనం – జాహ్నవి, అఖిల, విలోమ పఠనం – శ్రీ గోదా, నందిని దూబే, అక్షర దర్శనం – హాసిని, గీతిక లు పాల్గొని అవధానికి ప్రశ్నలు సంధించారు.

కాగా అప్రస్తుత ప్రసంగంలో కవి విట్టుబాబు పాల్గొని ఆవధానిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి కార్యక్రమాన్ని రంజింపజేశారు. ప్రాశ్నికులు వేసిన ప్రశ్నలకు అవధాని సమయస్పూర్తితో భగవద్గీత శ్లోకాలు ఆలపిస్తూ సమాధానాలు ఇచ్చారు.

అనంతరం కార్యక్రమ నిర్వాహకులు, నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్ అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ను, స్కూల్ కరస్పాండెంట్ చింతల మల్లేశం ను అభినందన పత్రాలతో, ప్రాశ్నికులను ప్రశంసా పత్రాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు శరత్ ద్యుతి, అమృత, హరిణి,
సంజనలు సభా పరిచయం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్ధిని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Exit mobile version