Site icon Chaithanya Galam News

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి – సీఐ రఘువీర్ రెడ్డి

రఘువీర్

రఘువీర్

Spread the love

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా వెల్దండ మండల కేంద్రంలో సోమవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

వెల్దండ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా వెల్దండ మండల కేంద్రంలో సోమవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. “వాహనాలు నడిపి క్షేమంగా తిరిగి రావాలి. ప్రమాదం జరిగితే కుటుంబం పడే బాధ వర్ణనాతీతం” అని అన్నారు.

గ్రామస్థులతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకట గౌడ్, ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్, కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి, రంగనాథం, గుద్దటి కిష్టల్, మసిగుండ్ల వెంకటేష్, పిల్లి దేవేందర్, బాదేపల్లి రమేష్, ఎస్. శేఖర్, రవీందర్ రెడ్డి, నాయకులు రషీద్, మట్ట భరత్, తిరుపతి రెడ్డి, ముదిగొండ రమేష్, మరేపల్లి శ్రీను, సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version