అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ గీతం “జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం” సృష్టికర్త, ప్రజా కవి డాక్టర్ ఎల్లయ్య అందెశ్రీ మరణ సంతాప సభ ఘనంగా జరిగింది.
అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ గీతం “జయ జయహే తెలంగాణ జననీ జనకేతనం” సృష్టికర్త, ప్రజా కవి డాక్టర్ ఎల్లయ్య అందెశ్రీ మరణ సంతాప సభ ఘనంగా జరిగింది. విద్యార్థి జేఏసీ చైర్మన్ శ్రీను నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
సభలో తెలంగాణ రాష్ట్ర సాధన జేఏసీ ఉద్యమ నాయకులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్మిక నాయకులు పాల్గొని అందెశ్రీ గారి కృషిని స్మరించారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ సాధన తర్వాత కళాకారుడిగా రాష్ట్ర గౌరవం పొందిన ఆయన, జయ జయహే తెలంగాణ పాటతో ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని నింపారని గుర్తుచేశారు.
అచ్చంపేట T-JAC తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ MPP రామనాథం, మాజీ MPP అవటశ్రీనివాసులు, జేఏసీ చైర్మన్ కాశన్న యాదవ్, మండికరి బాలాజీ, చింతల గోపాల్, అహ్మద్, ధర్మనాయక్, ఆర్టీసీ సంఘం నేత పర్వతాలు, యువజన సంఘం అధ్యక్షులు మహేంద్రనాథ్, రవికుమార్, యుటిఎఫ్ రాములు, సిపిఎం నేత శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. సభ చివరగా “జోహార్ అందెశ్రీ! జోహార్ అందెశ్రీ!!” అంటూ ఘనంగా ముగిసింది.

