Site icon Chaithanya Galam News

సపోటాతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

బరువు

బరువు

Spread the love

ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అధిక బరువు తో బాధపడే వాళ్లు అయితే సన్నబడేందుకు తెగ కష్టపడిపోతుంటారు. జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేయడం, ..

ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అధిక బరువుతో బాధపడే వాళ్లు అయితే సన్నబడేందుకు తెగ కష్టపడిపోతుంటారు. జిమ్ లో గంటల తరబడి వ్యాయామం చేయడం, నచ్చిన ఆహారం తినకుండా నోరు కట్టేసుకోవడం, అవసరమైతే ఓ పూట తిండి మానేయడం వంటివి చేస్తుంటారు. అయితే..మరీ ఇంత కష్టపడిపోవాల్సిన పనేమీ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నచ్చిన ఫుడ్ ను తీసుకుంటూ ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. అయితే.. మనం చేయాల్సిందల్లా ఆ పద్ధతులను కచ్చితంగా పాటించడమే. ప్రకృతి ప్రసాదించే పండ్లు, కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తియ్యని రుచితో చూడగానే నోరూరించే సపోటా గురించి..

సపోటా కేవలం రుచికరమైనది మాత్రమే కాదు. ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు సులభంగా బరువు తగ్గేలా చేస్తాయి. సపోటాలోని పీచు పదార్థాలు ఎక్కువ సమయం వరకు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి వేయడం తగ్గుతుంది. అనవరసంగా ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కడుపులోని మంటను పోగొడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తుంది.

కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ సపోటాను తినడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విటమిన్ సీ సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇ-విటమిన్ చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన సపోటాను డైట్ లో భాగం చేసుకోవాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version