Site icon Chaithanya Galam News

ప్రొద్దుటూరి వెంకన్న గుప్త కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ స్పీకర్

ప్రొద్దుటూరి

ప్రొద్దుటూరి

Spread the love

కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వెంకన్న గుప్త అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పరమపదించారు.

మహబూబాబాద్: కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వెంకన్న గుప్త అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పరమపదించారు.

ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్ మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకన్న గుప్త చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. అధైర్యపడొద్దు, మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నేను మీ వెంట ఉంటాను” అని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

కార్యక్రమంలో కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ జడ్పిటిసి అంబట్టి వీరభద్రం గౌడ్, స్థానిక నాయకులు బండి మల్లయ్య, బండి ఉప్పలయ్య, తోట నారాయణ, లక్కం వెంకన్న, ఆవుల రాంబాబుతో పాటు కాంగ్రెస్ మండల, గ్రామ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

వెంకన్న గుప్త సతీమణి సోమలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, PRG ఫౌండేషన్ సభ్యులు ప్రొద్దుటూరి వాసుదేవ గుప్త, రమణ గుప్త, రవీందర్ గుప్త, సురేందర్ గుప్త, దేవేందర్ గుప్త, హరేందర్ గుప్త తదితరులు హాజరయ్యారు.

Exit mobile version