Site icon Chaithanya Galam News

కబడ్డీ పోటీలను ప్రారంభించిన బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి

కబడ్డీ

కబడ్డీ

Spread the love

నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం పి. లింగాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సుంకులమ్మ గుడి 3వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం పి. లింగాపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సుంకులమ్మ గుడి 3వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ బైరెడ్డి మల్లికార్జున్ రెడ్డి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడల్లో గెలుపు–ఓటములు సహజం. ప్రతి క్రీడాకారుడు స్ఫూర్తితో మెలగాలి. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి” అని అన్నారు.

కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ గ్రామపంచాయతీ వింగ్ కార్యదర్శి, పగిడ్యాల సర్పంచ్ పెరుమాళ్ల శేషన్న, మోక్షము రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version